భారతదేశం, మార్చి 5 -- హారర్ సినిమాల్లో రక్తం చిందడం, ఆత్మలు వెంటాడటం కామన్. కానీ, చనిపోయిన తర్వాత మళ్లీ అదే రోజు ఉదయం నిద్రలేచి, అదే భయాన్ని పదే పదే అనుభవించాల్సి వస్తే? ఈ విభిన్నమైన 'టైమ్ లూప్' (Time Loop) కాన్సెప్ట్‌తో వచ్చిన జపనీస్ హారర్ థ్రిల్లర్ సినిమానే 'రి/మెంబర్' (Re/Member).

2022లో టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన రి/మెంబర్ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'రీ/మెంబర్: ది లాస్ట్ నైట్' (Re/Member: The Last Night) ఓటీటీలోకి ఇవాళ (మార్చి 5) అడుగుపెట్టింది.

తొలి భాగంలో అసుక అనే అమ్మాయి మాయమైన మూడు ఏళ్ల తర్వాత ఈ సీక్వెల్ కథ మొదలవుతుంది. ఒక హైస్కూల్‌లో చదివే ఆరుగురు విద్యార్థులు అనుకోకుండా ఒక 'బాడీ సర్చ్' (మృతదేహ భాగాల వేట) అనే వింత శాపంలో చిక్కుకుంటారు. ప్రతిరోజూ అర్థరాత్రి వారు తిరిగి తమ స్కూల్ లైబ్...