భారతదేశం, ఏప్రిల్ 7 -- బైబిల్‌లోని వివాదాస్పద కథనాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ది కార్పెంటర్ సన్'. ఘోస్ట్ రైడర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హాలీవుడ్ స్టార్ హీరో నికోలస్ కేజ్ ఈ మూవీలో మెయిన్ లీడ్‌లో నటించారు. ఆయనతోపాటు నోవా జుప్, ఎఫ్‌కేఏ ట్విగ్స్, ఐస్లా జాన్‌స్టన్, సౌహీల యాకూబ్, కైతి మనోలిడకి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

లోట్ఫీ నాథన్ ది కార్పెంటర్స్ సన్ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే, ఈ సినిమాకు నికోలస్ కేజ్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. హారర్ థ్రిల్లర్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ది కార్పెంటర్స్ సన్ సినిమా భారీ అంచనాల నడుమ గతేడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదల అయింది.

అయితే, ఈ సినిమా ఊహించినట్లుగా సక్సెస్ సాధించలేకపోయింది. చాలా వరకు నెగెటివిటీ తెచ్చుకుంది. ఈ సినిమాను జీసస్ చిన్ననాటి కథ ఆధారంగా తెరకెకక్క...