భారతదేశం, అక్టోబర్ 29 -- Mandala Murders OTT Streaming Telugu: డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో థ్రిల్లర్, హారర్, సైకో మిస్టరీ చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరు. అయితే, కేవలం నేరాలు, దర్యాప్తు మాత్రమే కాకుండా మనదేశంలోని ప్రాచీన చేతబడులు, తంత్ర మంత్రాలు, పౌరాణిక నమ్మకాలను జోడిస్తే ఆ థ్రిల్ రెట్టింపు అవుతుంది.

సరిగ్గా అలాంటి భయాందోళన రేకెత్తించే నేపథ్యంతో రూపుదిద్దుకున్న క్రేజీ ఓటీటీ వెబ్ సిరీస్ 'మండల మర్డర్స్'. స్క్రీన్ నుంచి కన్ను పక్కకు తిప్పుకోకుండా చేసే ట్విస్టులతో సాగే ఈ ఓటీటీ సిరీస్ ప్రస్తుతం డిజిటల్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.

ఉత్తరప్రదేశ్ వాతావరణంలో ఉన్న 'చరణ్‌దాస్‌పూర్' అనే ఊహాజనిత పట్టణం నేపథ్యంలో ఈ కథ ప్రారంభమవుతుంది. 1952వ సంవత్సరంలో 'ఆయస్తి' అనే ఒక రహస్య సమాజం 'ఆయస్త యంత్రం' సాయంతో చనిపోయిన వ్యక్తికి తిరిగి ప్రాణం పోయడానికి...