భారతదేశం, మార్చి 14 -- నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన 'మిసెస్' సినిమా విజయంతో మంచి జోష్‌లో ఉన్న హీరోయిన్ సాన్య మల్హోత్రా జీవితంలో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. ముంబై నగరంలో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు సాన్య. తాజాగా సాన్య మల్హోత్రా కొత్త ఇంటిని కొనుగోలు చేశారు.

ఈ క్రమంలో తన కొత్త ఇంటిలోకి సాంప్రదాయబద్ధంగా గృహ ప్రవేశ వేడుకతో అడుగుపెట్టారు. దీంతో సాన్య మల్హోత్రా గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

సాన్య మల్హోత్రా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె ఇల్లు అత్యంత విలాసవంతంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇంటి నుంచి అరేబియా సముద్ర అందాలు స్పష్టంగా కనిపిస్తుండటం విశేషం. అంటే సీ వ్యూతో సాన్య మల్హోత్రా తన ఇంటి కలను న...