భారతదేశం, ఆగస్టు 9 -- Top 5 OTT Crime Thrillers Free: వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీ వీక్షకులు ఎక్కువగా ఇష్టపడేది క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలనే. మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు, క్షణం క్షణం ఉత్కంఠ రేపే సన్నివేశాలు ఉంటే ఆ కిక్కే వేరు. అయితే రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండా ప్రైమ్ కంటెంట్‌ను ఉచితంగా చూడగలిగితే అంతకంటే కావలసిందేముంది?

డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) తమ వినియోగదారులకు అలాంటి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా జీ5 ఓటీటీలో ఉచితంగా వీక్షించగలిగే ఐదు పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలను ఇష్టపడేవారికి 'మిథ్య' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ జూహి, ఆమె వద్ద చదివే విద్యార్థిని రియా మధ్...