భారతదేశం, మే 24 -- OTT Crime Thrillers In Telugu Tamil Kannada Hindi: ఎండల తీవ్రత పెరగడంతో బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే కూర్చుని ఓటీటీ కంటెంట్ చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అలాంటి వారికోసం థ్రిల్‌ను పంచేందుకు క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీలోకి వచ్చేశాయి.

ఒక్క శుక్రవారం (మే 22) నాడు రెండు ఓటీటీల్లో నాలుగు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి ఒక్కో భాషలో ఒక్కోటి ఉంది. అంతేకాకుండా ఒక్క ఓటీటీలోనే ఏకంగా 3 క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ అవడం విశేషం. మరి విభిన్నమైన కథాంశాలతో కూడిన ఆ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

తమిళంలో సూపర్ హిట్ అయిన విలంగు ఓటీటీ వెబ్ సిరీస్ ప్రపంచం (Universe) నుంచి వచ్చిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ 'వారెంట్'. వారెంట్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ ది విలంగు...