భారతదేశం, నవంబర్ 11 -- OTT Crime Thriller: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో కామెడీ, యాక్షన్, హారర్ సినిమాల కంటే సమాజంలో జరిగిన దారుణాలను కళ్లకు కట్టే రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్లకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. అలాంటి క్రైమ్ థ్రిల్లర్ కావాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్ లోని భక్షక్ మూవీ చూడండి. ఓ దారుణమైన క్రైమ్, ఆ లోతుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించే ఓ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టినప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది.

ఈ సినిమాకు దర్శకుడు పుల్కిత్ దర్శకత్వం వహించగా, వర్సటైల్ నటి భూమి పెడ్నేకర్, సీనియర్ నటుడు సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించారు.

ఈ భక్షక్ సినిమా కథ బీహార్‌ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. 2018లో బీహార్‌లోని ముజఫర్‌పూర్ (Muzaffarpur Shelter Home Case) గర్ల్స్ షెల్టర...