భారతదేశం, అక్టోబర్ 12 -- Drishyam 3 The Conclusion OTT Release: బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న అజయ్ దేవగన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా 'దృశ్యం 3' (Drishyam: The Conclusion) ఓటీటీ రిలీజ్‌పై స్పష్టత వచ్చింది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, తొలి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

శ్రియా శరణ్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3 సినిమాను థియేటర్లలో చూసిన వీక్షకులు ఒకవైపు సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వార్తల కోసం డిజిటల్ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాక్సాఫీస్ రేసులో దృశ్యం ది కంక్లూజన్ సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోవులా చేస్తున్నాయి. మొదటి రోజునే ఏకంగా రూ. 62 క...