భారతదేశం, ఆగస్టు 27 -- OTT Crime Thriller: బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్స్ ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఘమాసాన్' (Ghamasaan) అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ పవర్‌ఫుల్ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ లాక్ అయింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ ఇంటెన్స్ డ్రామా జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

హిందీ హార్ట్‌ల్యాండ్ అయిన బుందేల్‌ఖండ్ లోయల నేపథ్యంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కథ సాగుతుంది. చట్టం, నేరం మధ్య ఉన్న గీత పూర్తిగా చెరిగిపోయిన చోట ఒక పోలీస్ ఆఫీసర్, తిరుగుబాటుదారుడైన నేరస్థుడి మధ్య జరిగే ప్రాణాంతకమైన పోరాటమే ఈ 'ఘమాసాన్'. తెలుగులో ఘమాసాన్ అంటే పెనుగులాట అని అర్థం.

'స్కామ్ 1992' సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చ...