భారతదేశం, మార్చి 21 -- బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి జంటగా నటించిన గ్యాంగ్‌స్టర్ లవ్ స్టోరీ చిత్రం'ఓ రోమియో'. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, హాట్ భామ దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు.

ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా ఓ రోమియో సినిమాను రూపొందించారు. అండర్‌వరల్డ్ మాఫియా, అధికారం కోసం జరిగే పోరాటం, వాటి మధ్య చిగురించిన ఒక సంక్లిష్టమైన ప్రేమకథే ఈ చిత్రం.

సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించిన ఈ సినిమాలో షాహిద్, తృప్తి, తమన్నా, దిశాతోపాటు సీనియర్ విలక్షణ నటుడు నానా పటేకర్, అవినాష్ తివారీ, విక్రాంత్ మాస్సే వంటి భారీ తారాగాణం నటించింది. ఈ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల అయింది.

ఈ ఏడాద...