భారతదేశం, నవంబర్ 28 -- Medical Crime Thriller Human OTT Release In 7 Languages: ఓటీటీ వేదికలపై క్రైమ్, హారర్, కామెడీ కథలు ఎన్నో వస్తుంటాయి. కానీ, మన చుట్టూ ఉన్న వైద్య రంగం వెనుక దాగి ఉన్న చీకటి వ్యాపారాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే సిరీస్‌లు ఓటీటీలోకి చాలా అరుదుగా వస్తాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఫార్మా రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, కొత్త మందుల తయారీ వెనుక జరిగే క్లినికల్ ట్రయల్స్ ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఆలోచింపజేసే అద్భుతమైన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'హ్యూమన్' (Human). 2022లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూస్తున్నంత సేపూ ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడుస్తుంది.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు, కార్పొరేట్ ఆసుపత్రులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై డబ్బు ఆశ చూపి పేద ప్రజలపై అక్రమ...