భారతదేశం, సెప్టెంబర్ 20 -- Mrunal Thakur Pooja Meri Jaan OTT Streaming: 'సీతారామం', 'హాయ్ నాన్న' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'పూజా మేరీ జాన్'.

ఈ సినిమా పూజా మేరీ జాన్ ఓటీటీలోకి వచ్చేందుకు ఎట్టకేలకు సిద్ధమైంది. షూటింగ్ పూర్తయి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నా రకరకాల కారణాలతో థియేటర్లలోకి రాకపోయిన పూజా మేరీ జాన్ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని పాపులర్ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) అధికారికంగా తాజాగా వెల్లడించింది.

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న జీ5లో పూజా మేరీ జాన్ ఓటీటీ రిలీజ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వంటి 4 భాషల్లో కూడా పూజా మేరీ జాన్ ఓటీట...