భారతదేశం, జూలై 27 -- Vadhandhi Season 2 OTT Release Date: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు అమేజాన్ ప్రైమ్ వీడియో తీపి కబురు అందించింది. తమిళంలో రూపొంది, తెలుగులోనూ విశేష ఆదరణ దక్కించుకున్న ప్రతిష్టాత్మక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్ 'వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని' రెండో భాగానికి రంగం సిద్ధమైంది.

మొదటి సీజన్‌తో ఓటీటీ ప్రపంచంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన ఈ సిరీస్ నుంచి 'వదంది సీజన్ 2' త్వరలోనే రాబోతున్నట్లు నిర్వాహకులు అధికారికంగా తాజాగా వెల్లడించారు.

తమిళ సినీ రంగంలో 'విక్రమ్-వేద', 'సుడల్' వంటి సూపర్ హిట్ ప్రాజెక్టులు అందించిన ప్రసిద్ధ ద్వయం పుష్కర్-గాయత్రి తమ 'వాల్‌వాచర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మించారు. ఆండ్రూ లూయిస్ సృష్టించి, దర్శకత్వం వహించిన ఈ కథ ఒక యువతి దారుణ హత్య చుట్టూ అల్లుకున్న వదంత...