భారతదేశం, నవంబర్ 7 -- Real Crime Thriller Talvar OTT Release: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు వచ్చిపడుతుంటాయి. అయితే అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ఓటీటీ వీక్షకుల మనసుపై బలమైన ముద్ర వేస్తాయి. అలాంటి కోవకు చెందినదే 2015లో విడుదలైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'తల్వార్'.

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నోయిడా ఆరుషి తల్వార్ జంట హత్యల కేసు ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికీ ఓటీటీలో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది ఈ తల్వార్ సినిమా. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు ఇష్టపడే వారికి అద్భుతమైన విందులా ఈ సినిమా నిలుస్తుంది.

కథ విషయానికి వస్తే, ఒకే ఇంట్లో శృతి అనే చిన్నారి, వారి ఇంట్లోనే పనిచేసే ఖేమ్‌పాల్ అనే వ్యక్తి ఘోర హత్యకు గురవుతారు. సంఘటన జరిగిన సమయంలో ఇల్లు లోపలి నుంచి గడియ ...