భారతదేశం, ఫిబ్రవరి 28 -- తెలుగు బుల్లితెర షో బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ హీరోగా తెరకెక్కిన ఓటీటీ సిరీస్ 'విక్రమ్ ఆన్ డ్యూటీ'. తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇటీవల విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రోమో వైరల్ అవుతుంది. డ్రమ్ కేసుతో చూపించిన ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. అన్ని రకాల అంశాలను జోడించి ఈ ఓటీటీ సిరీస్‌ను తెరకెక్కించినట్టుగా ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది. నిఖిల్ మాలియాక్కల్ ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా అదరగొట్టబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

ఇక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్షన్‌తో నిఖిల్ కనిపించనున్నాడు. ఓ వైపు సీరియస్‌గా కేసు గురించి చెబుతూ ఉండటం.. మరో వైపు ఆటో వాడితో బేరం ఆడుతూ విక్రమ్ పాత్రలో నిఖిల్ ఎంట్రీ ఇవ్వ...