భారతదేశం, జూన్ 19 -- M4M OTT Release Today On 2 Platforms: ప్రస్తుతం ఓటీటీ వేదికలపై సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ ఎప్పుడూ ప్రత్యేకమే. క్లైమాక్స్ వరకు ఊపిరి బిగబట్టే ఉత్కంఠతో సాగే సరికొత్త కథాంశంతో రూపొందే సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఓటీటీ లవర్స్.

అలా ఇటీవల థియేటర్లలో విడుదలైన తెలుగు మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే ఎమ్4ఎమ్ మోటివ్ ఫర్ మర్డర్ ('M4M' Motive For Murder). ఈ సినిమా మే 8న థియేటర్లలో విడుదలై మంచి రివ్యూలు అందుకుంది.

అయితే, ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడం వల్ల ఈ సినిమా అంటూ ఒకటి థియేటర్లలోకి వచ్చిందన్న విషయం చాలా వరకు ఆడియెన్స్‌కు తెలియకపోయింది. అందుకే బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా పెద్దగా హిట్ సాధించలకేపోయింది. కానీ, ఐఎమ్‌డీబీలో 9.1/10, బుక్‌మైషోలో 9.6/10 లాంటి అసాధారణ రేటింగ్‌లను సొ...