భారతదేశం, జూన్ 14 -- Ikka OTT Release Date Announced: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించిన 'బోర్డర్' (1997) సినిమాను బాలీవుడ్ మూవీ ప్రియులు ఎప్పటికీ మరువలేరు. ఆ ఆల్‌టైమ్ క్లాసిక్ వార్ డ్రామాలో కలిసి నటించిన యాక్షన్ స్టార్ హీరో సన్నీ డియోల్, వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా మళ్లీ 29 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు.

ఒకవైపు సన్నీ డియోల్ నటించిన 'బంత్వారా 1947' చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఆయన నటించిన సరికొత్త మైండ్ బ్లోయింగ్ మూవీ ఇక్కా ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్ చేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక్క సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల చేస్తున్నారు. ఇదొక సస్పెన్స్ ...