OTT Court: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్- సోనాక్షి సిన్హా, జ్యోతిక న్యాయ పోరాటం- తెలుగులోనూ స్ట్రీమింగ్
భారతదేశం, మే 22 -- Sonakshi Jyothika System OTT Release Today: సినిమా హాల్స్‌లో లీగల్ డ్రామాలకు ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. నైతికతకు, చట్టానికి మధ్య జరిగే పోరాటాలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు అమితాసక్తి చూపిస్తారు. ఇప్పుడు అదే తరహాలో ఓ బలమైన మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిన బాలీవుడ్ ఓటీటీ చిత్రం 'సిస్టమ్' డిజిటల్ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టింది.
బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన సౌత్ స్టార్ హీరోయిన్ జ్యోతిక కలయికలో వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఈ చిత్రానికి వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించారు.
వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు మహిళల చుట్టూ, వారి మధ్య నడిచే ఒక వివాదాస్పద కోర్టు కేసు నేపథ్యంలో ఈ సిస్టమ్ సినిమా సాగుతుంది. అధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.