భారతదేశం, జూన్ 1 -- Bold Psychological Horror Thriller Seducer OTT Release Telugu: అర్ధరాత్రి పూట లైట్లు ఆపేసి ఒక మంచి హారర్ సినిమా చూస్తూ థ్రిల్ అవ్వాలనుకునే ఓటీటీ ప్రియులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భయాన్ని పరిచయం చేస్తూ గతంలో థియేటర్లలో అలరించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

ఆ సినిమానే 'సెడ్యూసర్'. బోల్డ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సెడ్యూసర్ సినిమాను కొన్ని ఇంటర్నేషన్ల్ ప్రాంతాల్లో 'సక్యుబస్' (Succubus) అనే టైటిల్‌తో విడుదల చేశారు. సక్యుబస్ అంటే కామ పిశాచి లేదా ఆడ దెయ్యం అనే అర్థాలు వస్తాయి. అలాంటి ఈ సినిమా భారతీయ ఓటీటీ వీక్షకులను భయపెట్టడానికి సుమారు 2 ఏళ్ల తర్వాత వచ్చింది.

ఈ సినిమా కథాంశం అంతా ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. కొంతమంది యువకులు సరదాగా గడపడానికి ఒక నిర్మాన...