భారతదేశం, మార్చి 9 -- ఓటీటీ ప్రియుల కోసం సరికొత్త వినోదం సిద్ధమైంది. గత వారం ఓటీటీ రిలీజ్ అయిన 'వ్లాదిమిర్' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2022లో వచ్చిన పాపులర్ నవల ఆధారంగా తెరకెక్కిన బోల్డ్ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది.

ఈ ఎనిమిది ఎపిసోడ్ల ఓటీటీ సిరీస్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత, స్టార్ హీరోయిన్ రాచెల్ వీజ్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 5 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న వ్లాదిమిర్ ప్రస్తుతం ఇండియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే ట్రెండింగ్‌లో సత్తా చాటుతోంది వ్లాదిమిర్ మూవీ.

మార్చి 5న నెట్‌ఫ్లిక్స్‌లో వ్లాదిమిర్ ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లోనూ వ్లాదిమిర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 6 ప్లేసు...