భారతదేశం, మే 30 -- Bold Romantic Comedy Drama Spa OTT Release: ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు తెలుగు ఓటీటీ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. వైవిధ్యమైన కథలు, సహజమైన నటనతో ఆకట్టుకునే మాలీవుడ్ చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే, ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న సరికొత్త మలయాళ బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా స్పా ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజ్ అయిన స్పా మూవీ భిన్నమైన కథాంశంతో రూపొందింది. స్పా చిత్రానికి ఐఎమ్‌డీబీలో పదికి 6.3 రేటింగ్ వచ్చింది.

స్పా సినిమా కథ అంతా 'లా పారడైజ్' అనే ఒక అర్బన్ మసాజ్ థెరపీ సెంటర్ లోపల జరుగుతుంది. విభిన్న నేపథ్యాలు, రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్‌ను దర్శకు...