భారతదేశం, జూలై 5 -- Shresta Iyer Eliminated From Lock Upp 2 OTT Show: బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన బోల్డ్ రియాలిటీ షో 'లాక్ అప్' సీజన్ 2 (Lock Upp 2: Sach Ya Sazaa) సరికొత్త ట్విస్టులతో దూసుకుపోతోంది. ఓటీటీ వేదికగా సాగుతున్న ఈ జైలు ఆటలో మొదటి వారంలోనే ఊహించని పరిణామం ఎదురైంది.

స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ ఈ ఓటీటీ షో నుంచి మొదటి కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయ్యారు. అయితే, షో నుంచి బయటకు వచ్చినందుకు ఆమె ఏమాత్రం బాధపడకుండా, ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకోవడం విశేషం.

షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్.. శ్రేష్ఠ ఎలిమినేషన్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "షోలో నీ ప్రయాణం ముగిసినప్పటికీ.. నీ అన్నయ్య నీడ నుంచి బయటకు వచ్చే సరికొత్త ప్రయాణం ఇప్పుడే ...