భారతదేశం, సెప్టెంబర్ 17 -- Virender Sehwag Host Rise And Fall Season 2 OTT Streaming: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో 'రైజ్ అండ్ ఫాల్' రెండో సీజన్‌తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

మొదటి సీజన్‌లో అశ్నీర్ గ్రోవర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఈసారి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ హోస్టింగ్ బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది.

వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ ఈ ఓటీటీ షోపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది ప్రముఖులు పోటీ పడనున్నారు. తాజాగా విడుదల చేసిన రైజ్ అండ్ ఫాల్ 2 ప్రోమోలో మేకర్స్ మొదటి నలుగురు కంటెస్టెంట్లను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక చాహర్ చౌదరి, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్, ప్రము...