భారతదేశం, మే 14 -- Kunal Thakur On Netflix OTT Series Glory: ఇటీవల ఓటీటీలోకి మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గ్లోరీ. నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి గ్లోరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలోనే నెంబర్ వన్ సిరీస్‌గా గ్లోరీ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. అలాంటి ఈ ఓటీటీ సిరీస్‌లో నటీనటుల యాక్టింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.

ఇందులో దివ్యేందు, సువిందర్ విక్కీ, పుల్కిత్ సామ్రాట్ వంటి హేమాహేమీల నటన ఒక ఎత్తు అయితే.. రాకా పాత్రలో కనిపించిన కునాల్ ఠాకూర్ తనదైన ముద్ర వేశారు. ఈ ఓటీటీ సిరీస్ కోసం ఆయన కేవలం నటించడమే కాదు, ఒక నిజమైన బాక్సర్‌లా మారడానికి చేసిన ప్రయత్నాలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

రాకా పాత్ర కోసం కునాల్ ఠాకూర్ సుమారు 7 నుంచి 8 నెలల పాటు తీవ్రమైన శారీరక శిక్షణ ...