భారతదేశం, జూన్ 26 -- OTT: మలయాళ సినిమా ఇండస్ట్రీలోని అంతర్గత రాజకీయాల బ్యాక్‌డ్రాప్‌లో రీసెంట్‌గా థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ 'మాలీవుడ్ టైమ్స్' (Mollywood Times). ఈ సినిమా అధికారికంగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా అనౌన్స్ చేసింది.

థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర రూ. 18 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. జులై 3 నుంచి డిజిటల్ వ్యూవర్స్ ముందుకు రాబోతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఐఎండీబీలో 7.5 రేటింగ్ సాధించిన సినిమా ఇది.

ఈ సినిమాకు 'మలయాళ సినిమాపై ఒక లవ్ హేట్ లెటర్' అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇవ్వడం సోషల్ మీడియాలో ...