భారతదేశం, అక్టోబర్ 23 -- Parivarik Manuranjan OTT Release Teaser Out: వెర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి, హీరో సిద్ధార్థ్ భార్య, హీరోయిన్ అదితి రావు హైదరి తొలిసారి జంటగా తెరపై సందడి చేయనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం 'పరివారిక్ మనురంజన్'.

ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ 'సోనీ లివ్' (Sony LIV) ద్వారా ఓటీటీ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆకట్టుకునేలా పరివారిక్ మనురంజన్ టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'మనూ', 'రంజన్' అనే ఇద్దరి మధ్య చిగురించే ప్రేమకథను హాస్యభరితంగా చూపించనున్నారు. "మనూ, రంజన్ల ప్రేమకథ అందరికీ కావాల్సినంత వినోదాన్...