భారతదేశం, జూన్ 12 -- OTT: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త సోషియో-ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కరుప్పు'. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల మార్కును దాటి, 2026లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం.. థియేటర్లలో రికార్డులు సృష్టించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ (జూన్ 12) నుంచి కరుప్పు మూవీ ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం 'వీరభద్రుడు' అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు లేదా మళ్లీ చూసి ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ వీకెండ్‌లో ఓటీటీలో ఎందుకు వీక్షించాలో చెప్పే 5 అద్భుతమైన కారణాలు ఇక్కడ చూద్దాం.

ఈ సినిమాలో సూర్య పాత్ర డిజైన్ మైండ...