భారతదేశం, ఏప్రిల్ 27 -- OTT Series Resort Controversy Anugraha Nambiar Vs Vijay Kumar: ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన తమిళ వెబ్ సిరీస్ 'రిసార్ట్'. ఈ ఓటీటీ సిరీస్‌లో నటిస్తున్న అనుగ్రహ నంబియార్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.

రిసార్ట్ ఓటీటీ సిరీస్ యూనిట్ తన పారితోషికం చెల్లించకుండా వేధిస్తోందని, కాంట్రాక్టు పేరుతో తనను ఉచ్చులోకి లాగారని అనుగ్రహ నంబియార్ ఆరోపించారు. కేరళలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన తనలాంటి నటీమణులను ఇండస్ట్రీలో ఎలా వేధిస్తున్నారో వివరిస్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

"ఈ ఓటీటీ సిరీస్ కోసం నా డేట్స్ లాక్ చేయించుకున్నారు. తీరా చూస్తే పారితోషికం ఇవ్వడం లేదు. పోనీ వేరే ప్రాజెక్ట్స్ చేసుకుందామంటే ఈ కాంట్రాక్టు (ఏడాది) అడ్డు వస్తోంది. 4 నెలలుగా షూటింగ్ లేకుండా ఖాళీగ...