భారతదేశం, అక్టోబర్ 10 -- OTT Romantic Crime Action Thriller Awarapan 2 Trending In Top 1 Place: బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్న రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఆవారాపన్ 2 ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. పవన్ కల్యాణ్ ఓజీ విలన్ ఇమ్రాన్ హాష్మీ, కల్కి హీరోయిన్ దిశా పటానీ, షబానా అజ్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ఆవారాపన్ 2 ఓటీటీలో ఆకట్టుకుంటోంది.

ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది ఆవారాపన్ 2 సినిమా. థియేటర్లలో సందడి చేసిన కొన్ని వారాలకే ఆవారాపన్ 2 సినిమా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రావడం విశేషం.

2007లో విడుదలైన 'ఆవారాపన్' చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, కాలక్రమేణా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ముఖ్యంగా ...