భారతదేశం, అక్టోబర్ 23 -- Rangbaaz OTT Release In Telugu: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రోజురోజుకూ క్రైమ్ థ్రిల్లర్లు, సస్పెన్స్ డ్రామాలకు ఆదరణ పెరుగుతోంది. కేవలం ఊహాజనిత కథలకంటే, నిజ జీవితంలో జరిగిన గ్యాంగ్‌స్టర్ల కథలకు ఓటీటీ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ క్రమంలోనే ఓటీటీని ఊపేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో 'రంగబాజ్' ఒకటి. రంగబాజ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా వేటికవే విభిన్నమైన కథాంశాలతో ఉత్కంఠ రేకెత్తించాయి. ప్రసిద్ధ ఐఎమ్‌డీబీ (IMDb) ప్లాట్‌ఫామ్‌పై 7.7 రేటింగ్‌ సాధించి ఈ ఓటీటీ సిరీస్ అత్యుత్తమ ఆదరణ సొంతం చేసుకుంది.

మొదటి సీజన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నేపథ్యంతో రూపుదిద్దుకుంది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్, హిట్ మ్యాన్ శ్రీ ప్రకాష్ శుక్లా నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కి...