భారతదేశం, ఆగస్టు 13 -- Dark Giant OTT Release: ఈ మధ్య కాలంలో హారర్ సినిమాలు రూటు మార్చి ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం దెయ్యాలు, భయానక శబ్దాలతో జంప్ స్కేర్లు ఇవ్వడం వంటివి కాకుండా సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తూ హారర్ ప్రియులను అలరిస్తున్నాయి.

అలాంటి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా సినిమానే డార్క్ జెయింట్. భయపెట్టే దెయ్యాలు, జంప్ స్కేర్స్ మాత్రమే కాకుండా కుటుంబంలో ఉండే స్వార్థం, గిల్ట్, దురాశ, పాత తరం చేసిన తప్పులు ఎలా వెంటాడతాయనే మానసిక అంశాలతో ఈ తమిళ చిత్రం డార్క్ జెయింట్‌ను తెరకెక్కించారు.

మరి ఇలాంటి డార్క్ జెయింట్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ సైకలాజికల్ హారర్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కేఎస్ కిషన్ దర్శకత్వం వహించారు. సీనియర్ హీరోయిన్ సోనియా అగర్వాల్ కీ రోల్ చేసింది. ఇదే ఏడాది జూన్ ...