భారతదేశం, మే 3 -- OTT: మలయాళ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అద్భుతంగా కలిసి వస్తోంది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన 'భరతనాట్యం 2' కేవలం 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 2024లో వచ్చిన 'భరతనాట్యం' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం.. మొదటి భాగం కంటే భారీ విజయాన్ని నమోదు చేయడం విశేషం. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టి 'క్లీన్ హిట్'గా నిలిచింది.

ఈ భరతనాట్యం 2 సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నప్పటికీ.. మే 8 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఈ క్రేజీ థ్రిల్లర్‌ను కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిం...