భారతదేశం, మార్చి 27 -- ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆ సినిమానే హే బల్వంత్. హే బల్వంత్ సినిమాకు గోపి ఆచార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు కో రైట‌ర్‌గానూ వ‌ర్క్ చేశారు. ఈ సినిమాలో సుహాస్‌, శివాని నాగరం హీరో హీరోయిన్లుగా న‌టించగా.. ప్రముఖ నటుడు వీకే నరేష్ కీల‌క పాత్ర‌ను పోషించారు.

త్రిశూల్ విజ‌న‌రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై బి.న‌రేంద్ర రెడ్డి ఈ మూవీని నిర్మించారు. గుంటూరు నేప‌థ్యంలో 'హే బ‌ల్వంత్‌' సినిమాను రూపొందించారు. యువ‌కుడైన కృష్ణ‌(సుహాస్‌)కు తండ్రి వ్యాపారాన్ని కొన‌సాగించాల‌నే ఆస‌క్తి ఉంటుంది. అయితే త‌న తండ్రి చేసే వ్యాపారం ఏదో తెలియ‌డంతో త‌ను షాక‌వుతాడు.

అదే స‌మ‌యంలో మిత్ర‌ (శివానీ నాగ‌రం)తో ప్రేమ‌లో ఉంటాడు. మిత్ర ఓ ఎన్‌జీఓను న‌డుపుతుంటుంది. ప్రేమ, నైతిక విలువలు, తన తండ్రి రావు బాల్వంత్ చేసే బిజినెస్ విషయం తెలిస్తే...