భారతదేశం, జూన్ 12 -- Bhooth Bangla OTT Release Today: సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్‌లోనూ ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రాల హవా నడుస్తోంది. దెయ్యాల కథలకు కాస్త వినోదాన్ని జోడించి దర్శకులు వదులుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం 'భూత్ బంగ్లా' (Bhooth Bangla). ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలు తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మంచి విజయాన్ని అందుకుంది.

థియేటర్లలో అలరించిన ఈ భయానక కామెడీ చిత్రం భూత్ బంగ్లా ఓటీటీలోకి ఇవాళ (జూన్ 12) వచ్చేసింది. నేటి నుంచి ఓటీటీ వీక్షకులను భయపెట్టడానికి, నవ్వించడానికి డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది భూత్ బంగ్లా సినిమా.

ప్రముఖ ఓటీటీ స్ట...