భారతదేశం, సెప్టెంబర్ 27 -- Best 6 OTT Thriller Movies To Watch Today Sunday: వీకెండ్ వచ్చిందంటే చాలు సినీ లవర్స్ కొత్త సినిమాలు, డిజిటల్ సిరీస్‌ల కోసం ఓటీటీ వేదికలను జల్లెడ పడతారు. థియేటర్లలో సందడి ఒకెత్తయితే, ఇంటి పట్టునే హాయిగా కూర్చొని నచ్చిన కంటెంట్ చూడటం మరో అనుభూతి.

ఈ వారం డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు హారర్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్, బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో పలు ఆసక్తికరమైన చిత్రాలు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ఆహా సంస్థలు స్ట్రీమింగ్‌కు తెచ్చిన ది బెస్ట్ 6 ఓటీటీ థ్రిల్లర్ సినిమాలపై లుక్కేద్దాం.

భారత స్వాతంత్య్ర పోరాట నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన 8 ఎపిసోడ్ల ఓటీటీ సిరీస్ ఇది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యువ విప్లవకారు...