భారతదేశం, జూన్ 28 -- OTT: క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ను చూసి చూసి మొనాటనీ వచ్చిందా? ఓటీటీలో మంచి ఫీల్ గుడ్ మూవీ కోసం చూస్తున్నారా? అయితే ఈ రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన 'ప్రియమైన అంజలికి' మూవీ మీ కోసమే. ఈ సండే రోజు స్పెషల్ గా, తక్కువ టైమ్ లో అయిపోయే మూవీ చూడాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్.

తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా మూవీ 'ప్రియమైన అంజలికి' ఈ రోజు (జూన్ 28) ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ చిన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సండే స్పెషల్ గా ఈ చిత్రం డిజిటల్ ఆడియన్స్ ముందుకు నేరుగా ఓటీటీ రిలీజ్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.

ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి సండే కథా సుధాలో భాగంగా ఓ చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ రోజు 'ప్రియమైన అంజలికి' మూవీ వచ్చింది. ఈ మూవీ నిడివి కే...