భారతదేశం, అక్టోబర్ 26 -- Job Mela in Osmania University 2026 : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జాబ్ మేళా జరగనుంది. యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ఆర్థిక సేవల సంస్థ 'మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్'లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అప్‌డేట్ చేసిన బయోడేటా / రెజ్యూమ్‌తో పాటు విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లతో ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుంది. అదనపు సమాచారం లేదా ఇతర సందేహ...