భారతదేశం, మార్చి 15 -- బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ హీరో అనిల్ కపూర్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2008లో విడుదలై సంచలనం సృష్టించిన ఆస్కార్ విజేత 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమా అనిల్ కపూర్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు, ఇప్పటికీ ఆయన బ్యాంక్ అకౌంట్‌ను నింపుతూనే ఉంది.

ఇటీవల జరిగిన 'ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026'లో పాల్గొన్న అనిల్ కపూర్ ఒక ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. "ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా (స్లమ్‌డాగ్ మిలియనీర్) విడుదలై పదిహేనేళ్లకు పైగా (18 సంవత్సరాలు) అవుతోంది. అయినా సరే, నిన్ననే నాకు స్లమ్‌డాగ్ మిలియనీర్ టీమ్ నుంచి మరో పే చెక్కు వచ్చింది" అని అనిల్ కపూర్ వెల్లడించారు.

ఆ అమౌంట్ ఎంత అని అడగ్గా.. "నిన్న నాకు 3,000 పౌండ్లు (దాదాపు 3.2 లక్షల రూపాయలు) వచ్చాయి...