భారతదేశం, మే 11 -- హైదరాబాద్ నగరం శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం బొంగులూరు గేట్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో యువ హీరో భరత్ కాంత్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ మృతి చెందారు. ఈ ప్రమాదం టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రాథమిక వివరాల ప్రకారం.. హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కలిసి వ్యక్తిగత పని నిమిత్తం నెల్లూరు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి హైదరాబాద్కు కారులో బయలుదేరారు. వీరి కారు బొంగులూరు గేట్ సమీపంలోకి రాగానే, వేగంగా వచ్చిన ఒక కంటైనర్ వీరి వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. కారు నుజ్జునుజ్జు అయిపోయింది. కారులో ఉన్న భరత్ కాంత్, త్రిలోక్ ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతి చెందిన భరత్ కాంత్ ఇటీవలే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.