భారతదేశం, ఆగస్టు 14 -- కేరళలో ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఓనం పండగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని చర్లపల్లి నుంచి కేరళలోని కొట్టాయం మధ్య మొత్తం 6 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు.

ఆగస్టు 16 నుంచి 31వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. సాధారణంగా కాజీపేట, విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లకు భిన్నంగా, ఈ స్పెషల్ రైళ్లు నల్లగొండ, గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

ఈ ప్రత్యేక రైళ్లు వారంలో నిర్ణీత రోజుల్లో మాత్రమే నడుస్తాయి. వాటి సమయాలు, నంబర్ల వివరాలు కింద ఉన్నాయి. చర్లపల్లి - కొట్టాయం స్పెషల్ (ట్రైన్ నంబర్: 07197) ప్రతి ఆదివారం ఆగస్టు 16, 23, 30 తేదీలలో నడుస్తుంది. చర్లపల్లిలో ఉదయం 7:...