భారతదేశం, మార్చి 4 -- పండుగ వేళ భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' కస్టమర్లకు తీపి కబురు అందించింది. 'హోలీ మహోత్సవ్' పేరుతో చేపట్టిన ప్రత్యేక క్యాంపైన్​లో భాగంగా తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'రోడ్‌స్టర్' ధరలను భారీగా తగ్గించింది. పెట్రోల్ బైక్ కొనాలనుకునే వారిని సైతం ఎలక్ట్రిక్ వైపు మళ్లించేలా, అత్యంత సరసమైన ధరలకే వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్​ బైక్​ సిరీస్‌లో వివిధ బ్యాటరీ ఆప్షన్లు, ధరలను ఇలా నిర్ణయించింది:

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్: దీని ప్రారంభ ధరను రూ. 79,999 కు తగ్గించారు.

3.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ వెర్షన్: రూ. 92,999

4.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ వెర్షన్: రూ. 99,999

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్:

4.5 కేడబ్ల్...