భారతదేశం, జూలై 18 -- Oh Sukumari OTT Release Details: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'మసూద', 'పరేషాన్' వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ సినిమానే ఓ సుకుమారి. ఈ సినిమాలో తిరువీర్‌కు జోడీగా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చేసింది. భరత్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు మురళీధర్ గౌడ్, ఆమని, ఆనంద్, విష్ణు ఓయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించుకున్న ఓ సుకుమారి నిన్న అంటే జూలై 17న థియేటర్లలో విడుదల అయింది. ప్రేమించిన అమ్మాయిని...