భారతదేశం, మే 9 -- OG 2 Sujeet: పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్ యాక్షన్ డ్రామాగా గుర్తింపు పొందిన 'OG' (ఓజీ) మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది. దర్శకుడు సుజీత్ ఇప్పటికే పార్ట్-2 స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమైనట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఒక గ్యాంగ్‌స్టర్‌గా, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సుజీత్ చూపించిన విధానం అభిమానులకు పూనకాలు తెప్పించింది. 'సాహో' తర్వాత సుజీత్ మేకింగ్‌లో ఉన్న పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపించింది.

పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, ఆ పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టాయి. అప్పటి నుంచే ఈ కథకు కొనసాగింపు ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేస్తూ 'OG 2' పనులు ఊపందుకున్నాయి.

నిజానికి సుజీత్ తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో...