భారతదేశం, సెప్టెంబర్ 14 -- Sydney Sweeney Nude Ad Controversy: హాలీవుడ్ భామ, 'యుఫోరియా' ఓటీటీ సిరీస్ ఫేమ్ సిడ్నీ స్వీనీ మళ్లీ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. గతేడాది అమెరికన్ ఈగిల్ డెనిమ్ యాడ్‌తో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ హీరోయిన్ ఇప్పుడు 'నొవిగ్' (Novig) అనే స్పోర్ట్స్ ట్రేడింగ్ యాప్ కోసం చేసిన కొత్త ప్రచారంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

క్రీడల్లో మహిళల సాధికారత కోసం పోరాడుతున్న సమయంలో ఇలాంటి అసభ్యకర ప్రకటనలు తీసుకురావడం వెనకడుగు వేయడమేనని మహిళా అథ్లెట్లు మండిపడుతున్నారు. స్పోర్ట్స్ ట్రేడింగ్ యాప్ నొవిగ్ విడుదల చేసిన ఈ ప్రచార చిత్రంలో సిడ్నీ స్వీనీ ఒంటిపై దుస్తులు లేకుండా కనిపించారు.

ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హాకీ ప్యాడ్లు, టెన్నిస్ రాకెట్లు వంటి క్రీడా పరికరాలను మాత్రమే అడ్డుగా పెట్టుకుని భంగిమలు ఇచ్చారు నటి సిడ్న...