భారతదేశం, ఏప్రిల్ 30 -- NTR Neel Movie: దేవర, వార్ 2 ఫ్లాపుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాపై ఎట్టకేలకు ఒక అధికారిక క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ నుంచి వస్తున్న మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఆశించిన స్థాయిలో వేగంగా జరగకపోవడంతో ఫ్యాన్స్‌లో నెలకొన్న గందరగోళానికి మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ తాజాగా తెరదించారు.

ఇటీవల 'జెట్లీ' (Jetlee) చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ.. ఎన్టీఆర్-నీల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రకటించిన తేదీకే అంటే వచ్చే ఏడాది సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తాం. ప్రశాంత్ నీల్ గారు చాలా ఫాస్ట్‌గా పనిచేస్తారు. అ...