భారతదేశం, నవంబర్ 25 -- మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT 2027) రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రారంభించింది. 2027-28 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు ఇదోక మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్టీఏ సీమ్యాట్ అధికారిక వెబ్‌సైట్ cmat.nta.nic.in లోని డైరెక్ట్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సీమ్యాట్ 2027 దరఖాస్తుల స్వీకరణతో పాటు పరీక్ష, అడ్మిట్ కార్డులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థులు డిసెంబర్ 20, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము చెల్లించడానికి డిసెంబర్ 21, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. అప్లికేషన్‌లో పొరపాట్లు సరిదిద...