భారతదేశం, ఆగస్టు 20 -- Niu Lai Worldwide Box Office Collection: సాధారణంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే వందల కోట్ల బడ్జెట్, భారీ తారగణం, విస్తృతమైన ప్రచారం అవసరమని అంతా భావిస్తారు. కానీ, వీటన్నింటినీ బ్రేక్ చేస్తూ అసలు థియేటర్లలో కూడా విడుదలవుతుందో లేదో అనుకున్న ఒక చిన్న యానిమేషన్ సినిమా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని సరికొత్త రికార్డును నెలకొల్పింది.

కేవలం ఒక వెయ్యి డాలర్లతో (మన భారతీయ కరెన్సీలో రూ.85 వేల నుంచి రూ. లక్ష లోపు) నిర్మించిన 'నియూ లాయ్' (Niu Lai) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

'నియూ లాయ్' అంటే తెలుగులో "ఆవు వస్తోంది" అని అర్థం. 86 నిమిషాల నిడివి ఉన్న ఈ చైనీస్ యానిమేషన్ కథ ఒక కొత్తగా పుట్టిన ఆవు దూడ జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రేమ, నమ్మకం, బాధ్యత, త్యాగం వంటి విలువలను తల్లి ఆవు తన బిడ్డకు ఎల...