భారతదేశం, సెప్టెంబర్ 5 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మాయ ఆడుతున్న నాటకాన్ని రట్టు చేస్తూ విరాట్ అసలు నిజాన్ని రాబట్టడంతో కథ తీవ్ర ఉత్కంఠభరితంగా మారింది. జగదీశ్వరి చికిత్సకు మాయ కడుపులోని బిడ్డ శాంపిల్స్ 90 శాతం వరకు పర్ఫెక్ట్‌గా సరిపోలిందని రఘురామ్ ప్రకటించడంతో ఇంట్లో అందరూ తెగ సంతోషపడతారు.

అయితే, గతంలో డాక్టర్ చెప్పిన విషయాలను గుర్తుతెచ్చుకున్న విరాట్‌కు ఈ రిపోర్టుపై బలమైన అనుమానం వ్యక్తమవుతుంది. నిజం తేల్చుకోవడానికి ఎవరికీ చెప్పకుండా ఐవీఎఫ్ సెంటర్‌కు బయలుదేరతాడు విరాట్.

హాస్పిటల్‌కు చేరుకున్న విరాట్, సరోగసీ డాక్టర్‌ను బిడ్డ శాంపిల్స్ గురించి అడుగుతాడు. కానీ, డాక్టర్ విషయం చెప్పకుండా నీళ్లు నములుతాడు. విరాట్ ఎంత అడిగిన ఒక పట్టాన ఒప్పుకోడు డాక్టర్. దాంతో ఓపిక నశ...