భారతదేశం, మే 4 -- నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) త్వరలో తన రోగ నిర్ధారణ, చికిత్స ప్రక్రియల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరికరాలను అనుసంధానించనుంది. ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), తను (TANUH) ఫౌండేషన్‌తో నిమ్స్ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

నిమ్స్ అధికారులు సోమవారం నాడు ఐఐఎస్సీ (IISc) ఏఐ సెంటర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ పరిష్కారాలు, మల్టీ-సెంటర్ అధ్యయనాలు చేపట్టనున్నారు. రోగి వ్యక్తిగత డేటా ఆధారంగా ఖచ్చితమైన చికిత్స అందించే 'ప్రెసిషన్ మెడిసిన్'పై ఈ పరిశోధనలు దృష్టి సారిస్తాయి.

ప్రయోగశాలలో ఆవిష్కరించిన ఏఐ పరికరాలను నేరుగా రోగి చికిత్సలో వాడేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ భాగస్వామ్యానికి సంబంధించిన అధికారిక ప్రక్రియలు త్వరలోనే పూర్తి...