భారతదేశం, మే 4 -- నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) త్వరలో తన రోగ నిర్ధారణ, చికిత్స ప్రక్రియల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరికరాలను అనుసంధానించనుంది. ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), తను (TANUH) ఫౌండేషన్‌తో నిమ్స్ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
నిమ్స్ అధికారులు సోమవారం నాడు ఐఐఎస్సీ (IISc) ఏఐ సెంటర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ పరిష్కారాలు, మల్టీ-సెంటర్ అధ్యయనాలు చేపట్టనున్నారు. రోగి వ్యక్తిగత డేటా ఆధారంగా ఖచ్చితమైన చికిత్స అందించే 'ప్రెసిషన్ మెడిసిన్'పై ఈ పరిశోధనలు దృష్టి సారిస్తాయి.
ప్రయోగశాలలో ఆవిష్కరించిన ఏఐ పరికరాలను నేరుగా రోగి చికిత్సలో వాడేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ భాగస్వామ్యానికి సంబంధించిన అధికారిక ప్రక్రియలు త్వరలోనే పూర్తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.